- onlineearnbtc

ERAN MONEY ONLINE

test

Tuesday, 26 July 2016

నేడు ప్రపంచమంతటా ఇళ్లలో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇతర ప్రైవేటు కార్యకలాపాల్లో చట్టవిరుద్ధంగా, నిర్బంధంగా పనిచేస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లకు చేరిందని 2012 లోనే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) లెక్కగట్టింది. పశ్చిమాసియా దేశాల్లో కట్టుబానిసల్లా పనిచేస్తున్న స్త్రీపురుషుల సంఖ్య ఆరు లక్షలు. ప్రపంచమంతటా కట్టుబానిసల శ్రమ నుంచి ఏటా 15000 కోట్ల డాలర్ల (రూ. 10 లక్షల కోట్ల) అక్రమ లాభాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 800 కోట్ల డాలర్లు (రూ. 53,000 కోట్లు) ఇంటి పనివారి ద్వారానే లభిస్తున్నాయి. ప్రవాస మహిళలను కట్టు బానిసల్లా చూస్తూ వారికి జీతం ఇవ్వకుండానో, లేదా బాగా తక్కువగా ఇచ్చో గృహ యజమానులు మిగుల్చుకుంటున్న మొత్తమిది. అందుకే, గల్ఫ్‌లో ఇళ్లలో పనిచేసే మహిళలపై దాడులు పెరిగాయి. భవిష్యత్తులో ఇలాంటి పనుల కోసం మహిళలు వెళ్లకుండా ‘డొమెస్టిక్‌ మెయిడ్‌ నిషేధ’ చట్టం తీసుకురావాలని కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. గల్ఫ్‌లో ఇళ్లలో పనిచేసే మహిళల్లో చాలామందిని ఇంటి నాలుగు గోడల మధ్యనే బంధిస్తారు. యజమానులు తినగా మిగిలినది తిని వంట గదిలోనో హాలులోనో నిద్రించడం పరిపాటి. చాలామంది యజమానులు వలస కార్మికుల పాస్‌పోర్ట్‌లను తీసేసుకుని తమవద్దే అట్టిపెట్టుకుంటారు. వారి వేతనాలను బిగపడతారు. ఇలాంటి అక్రమాలను నిరోధించడానికి గల్ఫ్‌ దేశాల కార్మిక శాఖలే నేరుగా వలస కార్మికులను ‘రిక్రూట్‌’ చేసుకోవాలని ఐఎల్‌ఓ సూచించింది. పశ్చిమాసియాలో నానాటికీ కల్లోలం ప్రబలుతున్న దృష్ట్యా వలస కార్మికుల రక్షణకు ఇలాంటి పకడ్బందీ చర్యలెన్నో తీసుకోవలసి ఉంది. వచ్చే సెప్టెంబరు 19న ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సభలో వలస కార్మికులు, శరణార్థుల సమస్యల పరిష్కారానికి ‘అంతర్జాతీయ ప్రాతిపదిక ఒప్పందం’ కుదిరే సూచనలున్నాయి

No comments:

Post a Comment