తెదేపా-వైకాపా వర్గాల ఘర్షణ
శంఖవరం: పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు సందర్భంగా తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తుని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు
No comments:
Post a Comment